రూ.5లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
రూ.5లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత కేసముద్రం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు కాకతీయ, కేసముద్రం: ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10.165 కిలోల ఎండు గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అక్టోబర్ 17న ఉదయం 10.50 గంటలకు కేసముద్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జ్యోతిరావు ఫూలే సెంటర్ వద్ద పోలీసులు పెట్రోలింగ్...