సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు
సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బానోత్ సునీత వెంకన్న కాకతీయ, కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దాయ చెరువు వద్ద చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్మన్ అల్లం రమ నాగేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు....