గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం భరత్‌ వినతి కాకతీయ, గీసుగొండ: రాంపురం గ్రామంలో దసరా పండుగ నిర్వహణపై నెలకొన్న వివాదాన్ని చట్టప్రకారం పరిష్కరించి, శాంతిభద్రతలు కాపాడాలని సర్పంచ్‌ రడం భరత్‌ ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌, గీసుగొండ సీఐ, తహసీల్దార్‌, ఎంపీడీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. గతంలో గీసుగొండ గ్రామ పంచాయతీలో ఉపగ్రామంగా ఉన్న రాంపురం 2018లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిందని తెలిపారు. ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పటి నుంచి గీసుగొండకు...