చెన్నారావుపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ చింపివేత
చెన్నారావుపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ చింపివేత గుర్తుతెలియని వ్యక్తుల చర్యపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం కాకతీయ, చెన్నారావుపేట: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ చెన్నారావుపేట–నెక్కొండ ప్రధాన రహదారి పక్కన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు మహమ్మద్ రఫీ, గ్రామ పార్టీ అధ్యక్షుడు...