బాన్సువాడ దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి కాకతీయ, బాన్సువాడ: విజయదశమి సందర్భంగా ఈ నెల 20న బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ మినీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణ కాష్ఠ దహన కార్యక్రమ ఏర్పాట్లను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ డీఎస్పీ విఠల్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డితో కలిసి కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. వేడుకలకు హాజరయ్యే...