రాజేశ్వరి దేవికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
రాజేశ్వరి దేవికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు కాకతీయ, కరీంనగర్: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వద్ద ఉన్న శ్రీ రాజేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.