లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతంగా పేరొందిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నీళ్లు లేక బోసిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పంటలకు సాగునీరు అందించే చెరువులో ప్రస్తుతం నీరు లేకపోవడంతో దాని కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లతో నీటిని తోడిపోస్తున్నా ఎండల తీవ్రతకు భూమిలో తడి నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలు వారి...