కార్మికుల జీతాలు పెంచాల్సిందే!
కార్మికుల జీతాలు పెంచాల్సిందే! సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే కాంగ్రెస్ పాలనలో మూడేళ్లుగా జీతాల పెంపు లేదు అసెంబ్లీలో కార్మికుల పక్షాన పోరాడతా: మాజీ మంత్రి హరీశ్‌రావు కాకతీయ, సిద్దిపేట : పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాల్సిందేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటకు జాతీయ స్థాయిలో స్వచ్ఛత అవార్డులు రావడం తన గొప్పతనం కాదని, చలి, వానను లెక్కచేయకుండా శ్రమించిన పారిశుధ్య కార్మికుల కష్టానికి...