పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాకతీయ,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006–07 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న స్నేహితులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. పాఠశాల రోజుల్లోని సరదాలు, స్నేహాలు, అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. తమ జీవితాలకు విద్యాబాట చూపిన పాఠశాలను, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.