ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి సూచన కాకతీయ, శంకరపట్నం: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా కేశవపట్నం రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. మానకొండూర్ ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం...