భూమునిపాదం జలపాతం ఈడీసీలో నిధుల గోల్మాల్!
భూమునిపాదం జలపాతం ఈడీసీలో నిధుల గోల్మాల్! సభ్యుల సంతకాల ఫోర్జరీతో నిధుల స్వాహా? 2024 ఏప్రిల్ నుంచి ఐదుగురు కార్మికులకు అందని వేతనాలు అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతనగరం పరిధిలోని భూమునిపాదం జలపాతం వద్ద ఉన్న పర్యావరణ అభివృద్ధి కమిటీలో నిధుల అక్రమ వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా నిధులు కాజేశారనే ఆరోపణలు...