ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు కాకతీయ,శంకరపట్నం: మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా వీరుడు, ముదిరాజ్ సమాజ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పోలవేణి బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న సేవలను, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి...