ధ్రువంత్‌ సొల్యూషన్స్‌లో 50 ఉద్యోగాలకు జాబ్‌ మేళా

ధ్రువంత్‌ సొల్యూషన్స్‌లో 50 ఉద్యోగాలకు జాబ్‌ మేళా కాకతీయ, హనుమకొండ: హనుమకొండ, వరంగల్‌ జిల్లాల నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం తెలిపింది. ధ్రువంత్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ఖాళీగా ఉన్న 50 ఉద్యోగాలను ఈ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. టీమ్‌ లీడర్‌, టెలీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 20 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళా అభ్యర్థులు అర్హులు. డిగ్రీ, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు....