ఖో ఖో అభివృద్ధికి కృషి చేయాలి

ఖో ఖో అభివృద్ధికి కృషి చేయాలి గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి పెంచాలి ప్రతిభావంతులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు తెలంగాణ ఖో ఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కాకతీయ, కామారెడ్డి: ఖో ఖో క్రీడ అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా...