అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు పర్యాటక ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ప్రతి 15 రోజులకు పనుల పురోగతిపై సమీక్ష ములుగు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశం కాకతీయ, ములుగు : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో...