బీసీ ఏ వర్గీకరణపై మంత్రివర్గంలో చర్చిస్తాం
బీసీ ఏ వర్గీకరణపై మంత్రివర్గంలో చర్చిస్తాం ముదిరాజులకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం కాకతీయ, కొడంగల్: ముదిరాజులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చే అంశంపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. పండుగ సాయన్న జయంతి సభలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజుల జనాభా...