పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌!

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌! నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ డ్రగ్స్‌ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు చేర్యాల సీఐ బానోత్‌ రమేష్‌ నాయక్‌ వెల్లడి కాకతీయ, మద్దూర్‌: మద్దూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు చేర్యాల సీఐ బానోత్‌ రమేష్‌ నాయక్‌ వెల్లడించారు. బాధితురాలు మైనర్‌ కావడంతో పాటు, నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నందున వారి వ్యక్తిగత వివరాలు, గుర్తింపును వెల్లడించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం...