కల్పలత సూపర్‌బజార్‌లో ప్రక్షాళనకు శ్రీకారం!

కల్పలత సూపర్‌బజార్‌లో ప్రక్షాళనకు శ్రీకారం! రూ.80 లక్షల నిధుల అవకతవకలపై సమగ్ర విచారణ అడ్మినిస్ట్రేటర్‌గా ఆర్డీఓ వెంకటేష్‌ నియామకం కాకతీయ, వరంగల్ : వరంగల్‌ రంగంపేటలోని కల్పలత సూపర్‌బజార్‌ కోఆపరేటివ్‌ స్టోర్‌లో పరిపాలనను ప్రక్షాళన చేసి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ చర్యలు చేపట్టారు. స్టోర్‌ అడ్మినిస్ట్రేటర్‌గా హనుమకొండ ఆర్డీఓ ఎన్‌. వెంకటేష్‌ను నియమించగా, ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. స్టోర్‌లో సుమారు రూ.80 లక్షల నిధులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు జిల్లా సహకార అధికారి బాణావత్‌ మోహన్‌...