ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక విద్యార్థినులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 25న కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న అండర్‌-14 బాలబాలికల వాలీబాల్ పోటీల నేపథ్యంలో విద్యార్థినులు ఆది దుర్గ, నేహా జిల్లా జట్టుకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ ఎంపికైన...