కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది!
కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది! మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త.. దోమల విజృంభణతో ప్రజలకు విషజ్వరాల ముప్పు పట్టించుకోని అధికారులు.. రోగాల బారిన పడితేనే స్పందిస్తారా? కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వార్డుల్లో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని, దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతున్నారని స్థానికులు వాపోతున్నారు. మురుగు కాలువలే దోమలకు ఆవాసాలు! గ్రామంలోని...