తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
బంగాళాఖాతంలో తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం ఏపీకి భారీ వర్ష సూచన.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కాకతీయ, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. తుఫాన్‌గా బలపడిన తర్వాత దీనికి ‘అర్నాబ్’గా నామకరణం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి 860...