మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం మనాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రభుత్వం అందించిన ఉచిత షూలను ప్రధానోపాధ్యాయుడు తిరుపతి విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి, వారి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించిందన్నారు. ఉచితంగా షూలు అందడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మానస, వాణి, ప్రియాంక, మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు.