ఉపాధ్యాయ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం

ఉపాధ్యాయ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా దామెరకొండ సదానందం ఏకగ్రీవ ఎన్నిక ప్రధాన కార్యదర్శిగా జడల శ్రీనివాసరావు, కోశాధికారిగా కడారి మహేష్‌ 23 ఏళ్ల సంఘ ప్రస్థానం.. 17 మంది విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మానం కాకతీయ, వరంగల్ : రంగశాయిపేట ఉపాధ్యాయ సంక్షేమ పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం స్థాపించి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మూడోసారి అధ్యక్షుడిగా దామెరకొండ సదానందం, ప్రధాన కార్యదర్శిగా జడల...