అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి కానిస్టేబుల్ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి అమరుడి కుటుంబానికి సన్మానం.. విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం గంగాధర పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరుడు, కానిస్టేబుల్ గుజ్జెటి మహేశ్ విగ్రహానికి...