అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం
అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం కాకతీయ, చేర్యాల: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా జాతీయ మాల మహానాడు పనిచేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ అన్నారు. చేర్యాలలో సంఘం 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, సంఘం జెండాను ఆవిష్కరించారు. వర్గీకరణ వ్యతిరేక, తెలంగాణ ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాల్లో సంఘం చురుకుగా పాల్గొన్నదని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల హక్కులపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోందని...