రక్తదానం మహోన్నత సేవ
రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్: రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో రక్తం అందించడం కీలకమని సీపీ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు....