వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర
వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో మార్మోగిన ఊకల్ పుర వీధులు... కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగసుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవరుల ఉత్సవ విగ్రహాలను మల్లెపూలతో అలంకరించిన అశ్వ రథం పై...