పెద్దవంగర పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌

పెద్దవంగర పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కాకతీయ, పెద్దవంగర: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్దవంగర పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ప్రమోద్‌ కుమార్‌ పోలీసుల విధులు, బాధ్యతలు, ఆయుధాలు, భద్రతా పరికరాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ అమరవీరుల సేవలు, త్యాగాలను గుర్తుచేశారు. విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల...