పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శబరీష్‌ సూచించారు. మంగళవారం నెల్లికుదురు పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి విధుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, సాంకేతిక వ్యవస్థల వినియోగంపై ఎస్సై కరుణాకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అక్రమాలకు...