పెద్ది ఆశయ సాధనకు కదలాలి!
పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక ఇదే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు కాకతీయ, నర్సంపేట టౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. గురువారం చెన్నారావుపేట, నర్సంపేట రూరల్, ఖానాపూర్ మండలాల బీఆర్‌ఎస్ శ్రేణుల సమావేశంలో...