అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి
అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి జాప్యం చేస్తే, నాణ్యత లేకపోతే బిల్లుల్లో కోత కమిషనర్ టి వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాశీబుగ్గ సర్కిల్, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజిపేట, చార్ బౌలి, లక్ష్మీపురం మార్కెట్ ప్రాంతాల్లో నిర్మించిన...