రహదారి భద్రత, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి!
రహదారి భద్రత, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి! గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు నిబంధనల మేరకే బాణసంచా దుకాణాలకు అనుమతులు అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జి ఆదేశం కాకతీయ, ములుగు: రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్. మహేందర్ జి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టాలని, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు....