పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్
పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్ ములుగు జిల్లా పంచాయతీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో ఫోర్జరీ సంతకాలు మంగపేటలో మూడు పంచాయతీల్లో వివాదాలు వెంకటాపురం, వాజేడులోనూ అవకతవకలు జిల్లాలో ఏసీబీ దాడులు చేపట్టాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ములుగు : గ్రామాల అభివృద్ధికి వెచ్చించాల్సిన ప్రజాధనం అక్రమాల పాలవుతోందన్న ఆరోపణలు ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం మొదలుకొని చెల్లింపులు, వేలం ఆదాయం, అధికారిక రికార్డుల నిర్వహణ వరకు అనేక అవకతవకలు వెలుగుచూస్తుండటం పంచాయతీ పాలనలోని డొల్లతనాన్ని బట్టబయలు...