మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన కాకతీయ,శంకరపట్నం:మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని,...