కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన
కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన మెడారం ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) విద్యార్థిని దబ్బగట్ల దాక్షాయణిని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందించారు. విశాఖపట్నంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన ఐదో కేఐఓ సౌత్‌జోన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో సబ్ జూనియర్ బాలికల కుమిటే విభాగంలో దాక్షాయణి పాల్గొంది. ఆదిలాబాద్‌లో జరగనున్న తదుపరి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించాలని ఆమె పీఓను కోరింది. విజ్ఞప్తిని పరిశీలిస్తామని...