సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఇంటి పట్టాలు, వైద్యశాఖ సమస్యలు, తాత్కాలిక సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలు, అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు,...