పాఠశాలల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ తనిఖీ
పాఠశాలల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి: మానాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ సూచించారు. సోమవారం గ్రామంలోని పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.