ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఇనగాల వెంకట్రామ్రెడ్డి కాకతీయ, హనుమకొండ: ఢిల్లీలో నిర్వహించిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ మహాసభను విజయవంతం చేసిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన సభకు జిల్లా నుంచి శాసనసభ్యులు, రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్లు, టీపీసీసీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని...