మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్‌ కాకతీయ, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం అల్మాస్‌గూడలో అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో క్రైస్తవ మహిళలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి, చంపుతామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. మహిళలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. మహిళల...