ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!
ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి! హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదుల వినతి న్యాయస్థాన సాధన సమితి అధ్యక్షుడు దాగం ఆదినారాయణ విజ్ఞప్తి కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లాకు మంజూరైన నూతన జూనియర్ ఫాస్ట్ క్లాస్ న్యాయస్థానాన్ని ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని తాలూకా న్యాయస్థాన సాధన సమితి సభ్యులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయమూర్తులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, భీమపాక నగేష్, కాజా శరత్‌లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం న్యాయస్థాన ఏర్పాటును కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ఏటూరునాగారం ప్రాంత ప్రజలకు...