బెస్తగూడెంలో గుడుంబా తయారీ గుట్టురట్టు
బెస్తగూడెంలో గుడుంబా తయారీ గుట్టురట్టు 30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం ముగ్గురి పై కేసులు నమోదు కాకతీయ, ములుగు: గ్రామాల్లో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో గురువారం ఉదయం పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా...