ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ కన్నుమూత
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ కన్నుమూత నేడు స్వగ్రామం శాలిగౌరారంలో అంత్యక్రియలు కాకతీయ,తుంగతుర్తి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయనమ్మ చామల రంగనాయకమ్మ (వృద్ధాప్య కారణాలతో) ఈరోజు ఉదయం 6 గంటలకు కన్నుమూశారు.ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల్లో విషాదం నెలకొంది. రంగనాయకమ్మ గారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఆమె స్వగ్రామమైన శాలిగౌరారంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించనునున్నట్లు తెలిపారు.