ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది సిబ్బందికి నగదు రివార్డులు అందించిన సీపీ ఎన్‌.శ్వేత కాకతీయ, హనుమకొండ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను బ్లూకోల్ట్ సిబ్బంది వీరాస్వామి, తరుణ్‌కుమార్‌ సమయస్ఫూర్తితో కాపాడారు. కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుండ్ల సింగారానికి చెందిన వ్యక్తి శుక్రవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన భార్య డయల్‌ 112కు సమాచారం ఇచ్చింది. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా చింతగట్టు శివారులోని రైల్వే ట్రాక్‌ వద్ద అతడిని గుర్తించిన పోలీసులు, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు....