పాకాల సరస్సులో విషాదం

పాకాల సరస్సులో విషాదం తల్లి, ఇద్దరు పిల్లలు మృతి ఘటనపై పోలీసుల విచారణ కాకతీయ,ఖానాపురం:వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సులో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి సరస్సులో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.