టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు హాజరు ఐదు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ అధికారులకు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాలు కాకతీయ, హనుమకొండ : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. రెండు రోజుల...