నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక మాస పూజలు
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక మాస పూజలు కాకతీయ, గీసుగొండ: కార్తీక మాస మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగ సుబ్రహ్మణ్యేశ్వరునికి కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి,వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య...