వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా!
వెలుగుమట్లలో పేదల ముసుగులో భూమాఫియా! నిరుపేదల ఇళ్ల స్థలాల ఆశలతో అక్రమ వసూళ్లు సర్వే నంబర్లు 147, 148, 149లో ఆక్రమణలు హైకోర్టు, సీసీఎల్ఏ ఆదేశాలతోనే తొలగింపులు మిగిలిన దరఖాస్తులనూ పరిశీలించి అర్హులకు స్థలాలు : మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో పేదల పేరుతో కొందరు అక్రమార్కులు భూమాఫియాగా ఏర్పడి, నిరుపేదలను మోసం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి,...