మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి :బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారని...