కామవరపుకోట అభివృద్ధికి 26 హామీలు!
కామవరపుకోట అభివృద్ధికి 26 హామీలు! స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మధుసూదన్‌రావు మేనిఫెస్టో విడుదల కాకతీయ, ఏలూరు: కామవరపుకోట మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా 26 అంశాలతో మేనిఫెస్టో రూపొందించానని స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వీరమళ్ల మధుసూదన్‌రావు తెలిపారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. గురువారం మండల కేంద్రంలోని చైతన్య సెంటర్‌లో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు కొత్తూరులో మదర్ థెరిసా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు...