ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించిన హుజూరాబాద్ కోర్టు కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి రూ.3.60 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలికి న్యాయస్థానం రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన క్రైమ్ నంబర్ 63/2016, ఐపీసీ 420 సెక్షన్ కేసులో జమ్మికుంట మండలం రాచపల్లి...